ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Tg Hostel Diet Charges : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, హాస్టళ్ల డైట్ ఛార్జీలు భారీగా పెంపు
TG Hostel Diet Charges : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్, హాస్టళ్ల డైట్ ఛార్జీలు భారీగా పెంపు
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచింది. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచుతూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంపు
3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.1330కి పెంచారు. అలాగ 8 నుంచి 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1540కు, ఇంటర్ నుంచి పీజీ వరకు డైట్ ఛార్జీలను రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచారు. దీంతో పాటు 3 నుంచి 7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.55గా ఉన్న కాస్మోటిక్ ఛార్జీలను రూ.175కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 8 నుంచి 10వ తరగతి వరకు కాస్మోటిక్ ఛార్జీలలను రూ.75 నుంచి రూ.275కి పెంచారు. తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లలో 7,65,700 మంది విద్యార్థులు ఉన్నారు.

Bengali (Bangladesh) ·
English (United States) ·